ఎవరు 'గట్టిగా'.. ఇదో చెప్పలేని వింత పోటీ!

ఇదో వింత పోటీ. మొదటి సారిగా మన దేశంలో జరిగిందంటున్నారు నిర్వాహకులు. మరి ప్రపంచం మాట తెలీదు. ఈ పోటీ గురించి విన్న వారంతా ముక్కు మూసుకున్తుంటే.. ముగ్గురు మాత్రం చివరి వరకూ వెళ్లి బహుమతులు పట్టేశారు!

Update: 2019-09-24 06:08 GMT

సాధారణంగా తిండి మీద.. నడక లోనో.. పరుగుతోనో.. పాటలపైనో.. కొంచెం వెరైటీగా చూస్తే.. భార్యను ఎత్తుకుని ఎంత దూరం మోయగలరు? ఎన్ని తుమ్ములు తుమ్మగలరు? ఆపకుండా ఎంతసేపు దగ్గగలరు? ఇలాంటి పోటీలు సర్వ సహజంగా జరుగుతుంటాయి. వీటన్నిటి పరమార్థం అంతిమంగా చూసేవాళ్ళకు వినోదాన్ని పంచడమే. అయితే, ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడా కనీ, వినీ ఎరుగని పోటీ ఒకటి గుజరాత్ లో నిర్వహించారు. అటువంటి పోటీ ఒకటి ఉందని మీరు చెప్పినా నమ్మలేరు. కానీ, ఇది వాస్తవం. అసలు ఆ పోటీ గురించి చెబితే, మీ ముఖ కవళికలు మారిపోతాయి. మానవ సహజమైన ఆ ప్రక్రియను మాట్లాడుకోవడానికి లేదా ఆ సమయంలో పక్కన ఉండడానికి కూడా అసహ్యించుకుంటారు. కానీ, అటువంటి విషయంలోనే తాజాగా మొన్న ఆదివారం ఓ పోటీ నిర్వహించారు. ఏమిటా పోటీ అని ఉత్సుకత పెరిగిపోతోంది కదూ.. అక్కడికే వస్తున్నాం.

అపాన వాయువు విడిచి పెట్టడంలో ఎవరు గ్రేట్ అన్నదే ఆ పోటీ. ఏమిటీ తప్పు రాశామని అనుకుంటున్నారా? కాదు మీరు కరెక్టే చదివారు. అపాన వాయువు ఎంత గట్టిగా విడిచి పెట్టగలరు? ఎంత ఎక్కువసేపు విడిచిపెట్టగలరు? ఇవీ ఆ పోటీ లక్ష్యాలు. అన్నట్టు ఇంకో కేటగిరీ కూడా ఉందండోయ్! సంగీత భరితంగా ఎవరు ఆ పని చేయగలరనేది మూడో కేటగిరీ. ఇక ఆ పోటీ ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. వివరాలు ఇవిగో.. చదివి ఇటువంటి పోటీ పెట్టిన వారిపై మీకు ఎలా రియాక్ట్ అవ్వాలని అనిపిస్తే అలా రియాక్ట్ అవ్వండి. ఒక విశేషం మీముందు ఉంచాలనే ఈ వార్త ఇస్తున్నాం.. మీ రియాక్షన్స్ మా మీద చూపించకండి సుమా!

ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. గుజరాత్ లోని సూరత్ లో ఆదివారం అపానవాయు పోటీలు నిర్వహించారు. అయితే, అవి విజయవంతం కాలేదు. యతిన్ సింగోయ్ అనే నిర్వాహకుడు తెలిపిన దాని ప్రకారం ఈ పోటీ కోసం 60 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 20 మంది మాత్రమె పోటీకి వచ్చారు. ఈ పోటీ చూడటానికి 70 మంది ప్రేక్షకులు (కరక్టేనా) కొంత మంది మీడియా ప్రతినిధులు వచ్చారని అయన చెప్పారు. అయితే, పోటీలో పాల్గొంటామని వచ్చిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే పోటీలో పాల్గొన్నారట. మిగిలిన 17 మందీ సిగ్గుతో పోటీలో పాల్గోకుండా ఉండిపోయారట.

ఇంకా అయన ఇలా చెప్పుకొచ్చారు.."పోటీలో పాల్గొన్నది ముగ్గురే కావడంతో వారికి ట్రోఫీలు ఇవ్వలేదు. కేవలం గిఫ్ట్ యంపర్ లు ఇచ్చి పంపించాం. నిజానికి పోటీలో పాల్గోవడానికి వచ్చిన వారు మీడియా, ఇతర ప్రేక్షకులను చూసి సిగ్గుపడిపోవడంతో పోటీ విఫలం అయింది. అయితే, తరువాతి పోటీలు ముంబాయిలో మేం నిర్వహించానున్నాం. ఆ పోటీలు ప్రేక్షకులు లేకుండా జరిపేలా చర్యలు తీసుకుంటాం. అపానవాయువు విడుదల చేయడంలో పోటీలో విజేతలను నిర్ణయించడానికి.. ఆ పరిస్థితులను కొలవడానికి మేం ప్రత్యేకమైన పరికరాలు తయారు చేయించాం''

ఇదండీ సంగతి.. ఇంత చెప్పుకున్న వాళ్ళం పోటీలో నిస్సిగ్గుగా పాల్గొన్న వాళ్ళ వివరాలు చెప్పెసుకుంటే ఓ పని అయిపోతుంది కదా! గుజరాత్ బర్దోలీ కి చెందిన సుషీల్ జైన్, పటాన్ కు చెందిన అల్కేష్ పాండ్య, సూరత్ కు చెడిన విష్ణు హేడా ఆ పోతీదరులని నిర్వాహకులు ప్రకటించారు.


Tags:    

Similar News