ఢిల్లీలో కొనసాగుతోన్న రైతుల ఆందోళన.. దేశవ్యాప్తంగా ఇవాళ శ్రద్ధాంజలి దివస్ కు పిలుపు

Update: 2020-12-20 05:06 GMT

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం చట్టాలు రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు రైతులు. ఎముకలు కొరికే చలిలోనూ తమ పట్టు వీడకుండా చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు.

ఇక ఈ ఆందోళనల్లో చలి, అనారోగ్యం, ఆత్మహత్యలతో ఇప్పటివరకు 24 మంది రైతులు, మద్దతుదారులు మరణించారు. దీంతో వారికి ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సంతాప దినాలు జరపాలని రైతు పోరాట సమితి పిలుపునిచ్చింది. శ్రద్ధాంజలి దివస్ పేరుతో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు లక్ష గ్రామాల్లో నివాళులర్పించనున్నారు రైతులు. మరోవైపు ఇవాళ ఉదయం 11 గంటలకు అధికారులతో ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు సమావేశం కానున్నారు. ఢిల్లీ వస్తోన్న ట్రాక్టర్లను ఆపడంపై చర్చించనున్నారు.

Tags:    

Similar News