Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా రైతులు రైల్ రోకో

*ఆందోళనలకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా *హర్యానాలోని బహదూర్‌ఘర్ వద్ద నిరసనలు

Update: 2021-10-18 07:28 GMT

లఖీంపూర్ ఖేరీ ఘటనకు నిరసనగా రైతులు రైల్ రోకో(ఫైల్ ఫోటో)

Lakhimpur Kheri: లఖీంపూర్ ఖేరీ ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల మృతికి కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను అరెస్ట్ చేయాలని, ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. ఆరు గంటల పాటు రైల్ రోకో ఆందోళనలకు రైతులు పిలుపునిచ్చారు. ఉదయం 10గంటలకు ప్రారంభమైన రైల్ రోకో సాయంత్రం 4గంటల వరకు సాగనుంది. శాంతియుతంగా నిరసత తెలపాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. హర్యానాలోని బహదూర్‌ఘర్ వద్ద రైతులు పట్టాలపై కూర్చుని ఆందోళన చేపట్టారు. 

Tags:    

Similar News