రైతులను చర్చలకు ఆహ్వానించిన కేంద్రం

Update: 2020-12-28 12:27 GMT

వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. డిసెంబర్ 30న చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. డిసెంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో చర్చలకు రావాల్సిందిగా కోరింది. కొత్త వ్యవసాయ చట్టాలపై తమ అభ్యతరాలను తెలపాలని కోరింది.

నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులు తాము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. డిసెంబర్ 29న చర్చలు జరపాలని కోరారు. వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయడమే ప్రధాన ఎజెండాగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే, కేంద్రం డిసెంబర్ 30న మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. రైతులతో చర్చల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు.

Tags:    

Similar News