ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళన:చర్చలకు పిలుస్తున్న ప్రభుత్వం

* రైతులను శాంతింపజేసేందుకు కేంద్రం ప్రయత్నాలు * రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం-తోమర్ * రైతులు తమ ఆందోళనలు ఆపి..చర్చలకు రావాలి-తోమర్

Update: 2020-11-29 06:40 GMT

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులను శాంతింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది. రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతులు తమ ఆందోళనలు ఆపి. చర్చలకు రావాలని ఆహ్వానించారు. డిసెంబర్ 3న 32 రైతు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశామని. సమావేశంలో రైతులు వ్యక్తపరుస్తున్న అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి తోమర్ తెలిపారు. డిసెంబర్‌3లోపే చర్చలు జరగాలని రైతు సంఘం నాయకులు కోరుకుంటే అలాగే చేద్దామని మంత్రి స్పష్టం చేశారు.

ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ఢిల్లీలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలోని సిబ్బంది పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుందని ఖట్టర్‌ ఆరోపించారు. ఖట్టర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.   

Full View


Tags:    

Similar News