ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తం.. హింసకు పాల్పడవద్దని రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి

* హింసకు పాల్పడవద్దని రైతులకు రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి * హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని సూచన * వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

Update: 2021-01-26 10:15 GMT

rahul gandhi (file image)

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని సూచించారు. ఎవరైనా గాయపడితే దేశానికి నష్టం జరుగుతుందని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


Tags:    

Similar News