ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు
* వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు నిరసనలు * భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన రైతు సంఘాలు * గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీకి పిలుపు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తాము ఢిల్లీ సరిహద్దుల్లోనే ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘాలు మరోసారి తెగేసిచెప్పాయ్. జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వైపుగా ట్రాక్టర్ ర్యాలీకి పిలునిచ్చామని నేతలు తెలిపారు. ట్రాక్టర్లపై జాతీయ జెండాలతో కిసాన్ పరేడ్ పేరుతో ప్రదర్శన నిర్వహిస్తామని అన్నారు. 23న ప్రతి రాష్ట్రంలో గవర్నర్ల నివాసాల వైపు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు 50శాతం డిమాండ్లను అంగీకరించిందని వస్తున్న వార్తలు పూర్తి అవాస్తమని కొందరు నేతలు వివరించారు. ఇప్పటివరకు రాతపూర్వకంగా ప్రభుత్వం నుంచి ఒక్క హామీ కూడా లభించలేదని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు 39వ రోజుకు చేరాయి. ఈ నెల 4న జరగనున్న ఏడో విడత చర్చల్లో కేంద్రం ఏదో ఒకటి తేల్చకపోతే హర్యానాలోని మాల్స్, పెట్రోల్ బంకులను మూసివేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. ఇప్పటివరకు ఆరు దఫాలుగా జరిగిన చర్చల్లో రైతుల ప్రధాన డిమాండ్లు అయిన మూడు సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ అంశాల్లో ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదని వారు విమర్శించారు. ప్రభుత్వంతో చర్చలు ఇలానే ఫలితం ఇవ్వకుండా సాగుతూ ఉంటే ఆందోళనల తీవ్రతను పెంచుతామని హెచ్చరించారు.
ఢిల్లీలో 38వరోజుకు చేరిన అన్నదాతల ఆందోళనలు. జనవరి 26న ఢిల్లీ వైపుగా ట్రాక్టర్ ర్యాలీకి నిర్వహిస్తామని ప్రకటన