డిసెంబర్ 8 న భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతులు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నప్పటికి అవి ఎలాంటి ఫలితాన్నివ్వటం లేదు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నప్పటికి అవి ఎలాంటి ఫలితాన్నివ్వటం లేదు. ఈ క్రమంలో అసంతృప్తి చెందిన రైతులు డిసెంబర్ 8 (మంగళవారం) న భారత్ బంద్ ఉంటుందని, అల్ ఇండియా కిసాన్ సభ, భారతీయ కిసాన్ యూనియన్ వెల్లడించాయి. డిసెంబర్ 5 న దేశవ్యాప్తంగా రైతులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబోమ్మలను దహనం చేయాలనీ పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే వెనక్కి తగ్గేది లేదని, ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇక డిసెంబర్ 8వ తేదీన దేశ వ్యాప్త బంద్ పాటించాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసేస్తామని ప్రకటించారు.