ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళన!
ఇక మరోపక్క రైతులకు మద్ధతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు.
ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు వివిధ పార్టీలు, పలు సంఘాలు మద్ధతు పలికాయి. ఈనెల 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్ధతు పలికాయి. రైతు సంఘాల బంద్‌కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్ధతు పలికింది
ఇక మరోపక్క రైతులకు మద్ధతుగా పంజాబ్‌కు చెందిన పలువురు మాజీ క్రీడాకారులు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పద్మశ్రీ, అర్జున అవార్డులను వాపసు చేసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లే కీలక రహదారులపై రైతులు నిరసనలు తెలుపుతుండటంతో గడిచిన 11 రోజులుగా ఈ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని మార్గాలను మూసివేసి.. మరికొన్ని రోడ్లలో వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
దీర్ఘకాలం పోరుకు రైతులు సమాయత్తమవుతుండటంతో... రోడ్లు గ్రామాలుగా మారిపోయాయి. రైతులు రోడ్లపై ట్రాక్టర్లు నిలిపి.. టెంట్లు వేసుకొని వంటావార్పు చేసుకుంటున్నారు. ఆందోళనలో పాలుపంచుకుంటున్న వృద్ధుల కోసం కొందరు వైద్యులు.. శిబిరాలు ఏర్పాటు చేశారు.