Delhi Farmers: రైతు సంఘాల్లో చీలిక

* ఆందోళనల నుంచి తప్పుకున్న రెండు సంఘాలు * ఉద్యమం నుంచి తప్పుకున్న ఏఐకేఎస్‌సీసీ, బీకేయూ * ఢిల్లీ విధ్వంసానికి విద్రోహశక్తులే కారణమన్న రైతు నేతలు

Update: 2021-01-28 04:20 GMT

Representational Image

రిపబ్లిక్ డే నాడు రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీయడం.. ఆందోళన అదుపు తప్పడం.. వంటి చర్యలు ఆ సంఘాల్లో చీలికకు కారణం అయ్యాయి. ఉద్యమం నుంచి రెండు సంఘాలు తప్పుకున్నాయి. ఆందోళనల నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్, రాష్ట్రీయ కిసాన్ ఆందోళన్‌ సంఘటన్ ప్రకటించాయి. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం నుంచి వెంటనే తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి.

 వేరే పద్దతిలో ఆందోళన చేస్తున్న వాళ్లతో తాము కలిసి పని చేయబోమని AIKSCC లీడర్ వీఎం సింగ్ స్పష్టం చేశారు. ఆందోళన చేయాలని, కానీ, చేయాల్సిన పద్దతి ఇది కాదన్నారు. బడ్జెట్ ప్రకటించే ఫిబ్రవరి 1న పార్లమెంట్ వరకు తలపెట్టిన పాదయాత్రను రద్దు చేస్తున్నట్లు 41 రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.

 మరోవైపు ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి సుమారు200 మందిని అరెస్ట్ చేశారు. ర్యాలీకి విధించిన షరతులను ఉల్లంఘించినందున, ఎన్ఓసీపై సంతకం చేసిన ఆరుగురు రైతు సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు మేధాపాట్కర్, యోగేంద్ర యాదవ్‌లతో పాటు మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

Tags:    

Similar News