లోక్‌సభలో వ్యవసాయ చట్టాలపై వాడివేడిగా చర్చ జరిగింది. నూతన వ్యవసాయచట్టాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను కొనుగోలు చేసుకోవచ్చని చట్టంలో ఉందని, ఇక ఎక్కడైనా కొనుగోలు చేసుకుంటే మండీకి వచ్చేవారు ఎవరుంటారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. మొదటి వ్యవసాయ చట్టంతో మార్కెట్లు మూతపడతాయన్న రాహుల్ ఎంఎస్‌పీ వ్యవస్థను అంతం చేసేందుకే రెండవ చట్టం తెచ్చారని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాహుల్ అభిప్రాయపడ్డారు.