farm bills passed in Rajya Sabha : పెద్దల సభలో పెను దుమారం.. పంతం నెగ్గించుకున్న కేంద్రం!
. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఇవాళ రాజ్యసభకలో చర్చకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ
ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకుంది.. నిరసనల నడుమ రాజ్యసభలో వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. విపక్షాల ఆందోళన నడుమ బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం లభించింది. ఇక అంతకుముందు ఈ బిల్లులు రాజ్యసభలో తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓటింగ్ సందర్భంగా గందరగోళం నెలకొంది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లులు ఇవాళ రాజ్యసభకలో చర్చకు రావడంతో ఉదయం నుంచీ వాడీవేడి చర్చ జరుగుతోంది. రైతు వ్యతిరేక విధానాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్షాలు నినాదాలు చేశాయి. బిల్లును అడ్డుకునేందుకు డిప్యూటీ చైర్మన్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ప్రతిపక్ష సభ్యులు..
ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఎంపి డెరెక్ ఒబెరాయ్ బిల్లు మాసాయిదా ప్రతులను చించివేశారు. అంతేకాదు రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ మైక్‌లను సైతం విరిగగొట్టే ప్రయత్నం చేశారు కొందరు ఎంపీలు. దాంతో సభలో ఓటింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో 10 నిమిషాలు సభ వాయిదా పడింది. అనంతరం మళ్ళీ ప్రారంభమైన తరువాత మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందినట్టుగా డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం సభను సోమవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేశారు.