Madhya Pradesh: మధ్యప్రదేశ్‌‌లో రెమ్‌డెసివిర్‌కు నకిలీల ముఠా

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నకిలీ మందుల ముఠా పోలీసులకు పట్టుబడింది.

Update: 2021-05-11 05:45 GMT

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌‌లో రెమ్‌డెసివిర్‌కు నకిలీల ముఠా

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నకిలీ మందుల ముఠా పోలీసులకు పట్టుబడింది. కరోనా బారిన పడినవారికి దివ్యౌవషధంగా చెబుతున్న రెమ్‌డెసివిర్‌కు నకిలీలు తయారు చేసి అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ నకిలీ ముఠాకు విశ్వహిందూ పరిషత్‌ నాయకుడే సూత్రధారి కావడం విశేషం. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రి కుమారుడితో ఈ వీహెచ్‌పీ నేతకు దగ్గర సంబంధాలున్నాయని అంటున్నారు.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జబల్‌పూర్‌ పోలీసులు వీహెచ్‌పి నేత సరబ్‌జిత్‌ సింగ్‌ మోకా, మరికొందరిపై కేసులు నమోదు చేశారు. సరబ్‌జిత్‌కు సబల్‌పూర్‌లో ఓ ఆస్పత్రి ఉంది. కొందరు ఫార్మా డీలర్లతో కుమ్మక్కైన సరబ్‌జిత్‌ ఈ కుంభకోణానికి తెర తీసాడు. దాదాపు లక్ష డోసుల నకిలీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు దేశ వ్యాప్తంగా అమ్మినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ వీహెచ్‌పీ నేత పరారీలో ఉన్నాడు.

Tags:    

Similar News