ITR Filing: డిసెంబర్‌ 31లోపు ఐటీఆర్ ఫైల్‌ చేయలేదా.. ఏం జరుగుతుందంటే..?

ITR Filing: డిసెంబర్‌ 31లోపు ఐటీఆర్ ఫైల్‌ చేయలేదా.. ఏం జరుగుతుందంటే..?

Update: 2022-02-03 06:00 GMT

ITR Filing: డిసెంబర్‌ 31లోపు ఐటీఆర్ ఫైల్‌ చేయలేదా.. ఏం జరుగుతుందంటే..?

ITR Filing: డిసెంబర్ 31లోపు ఇన్‌కమ్ ట్యాక్స్‌ ఫైల్‌ చేయనివారికి ఇప్పుడు బాదుడు తప్పదు. వాస్తవానికి ప్రభుత్వం ఐటీఆర్‌ ఫైల్‌ చేయడానికి మార్చి 31 డెడ్‌లైన్ విధించింది. కానీ ఇది అందరికి కాదు. కార్పొరేట్ క్లాస్ రిటర్న్ ఫైలింగ్ కోసం ఆడిట్ చేయబడిన ఖాతాల రిటర్న్‌లను దాఖలు చేయడానికి మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31లోపు ఐటిఆర్ దాఖలు చేయలేకపోతే ఇప్పుడు మార్చి 15 వరకు ఈ పని చేయవచ్చని ఆలోచిస్తారు కానీ ఇది కుదరదు.

ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయాల్సిన కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల కోసం మాత్రమే వ్యవధి పొడగించారు. మీరు డిసెంబర్ 31 తేదీలోపు కార్పొరేట్ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయలేకపోతే మీరు మీ సొంత పూచీకత్తుపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఫైల్ చేయలేరని గుర్తుంచుకోండి. ఆదాయపు పన్ను శాఖ అనుమతిస్తేనే మీరు మీ పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయగలుగుతారు. ఆదాయపు పన్ను శాఖ మీ పేరు మీద నోటీసు పంపుతుంది. ఆ నోటీసుపై స్పందించాల్సి ఉంటుంది. రిటర్న్‌ దాఖలు చేయలేకపోవడానికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఆదాయ పన్ను శాఖ నుంచి అనుమతి పొందిన తర్వాత మాత్రమే రిటర్న్‌ను ఫైల్ చేయగలరు.

ఆలస్యంగా పన్ను చెల్లిస్తే జరిమానా కూడా విధిస్తారు. మీ పన్ను మొత్తంలో 50 శాతం వరకు పెనాల్టీగా చెల్లించాల్సి రావచ్చు. ఆదాయపు పన్ను శాఖ కోరుకుంటే వడ్డీని కూడా వసూలు చేయవచ్చు. మీరు రిటర్న్ పెండింగ్‌లో ఉంచిన నెలల సంఖ్య ప్రకారం వడ్డీని కూడా వసూలు చేయవచ్చు. వడ్డీ రేటు 1% శాతంగా ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం సెక్షన్ 234F నిబంధనను ప్రవేశపెట్టింది దీని ప్రకారం ఆదాయ పన్ను శాఖ జరిమానా వసూలు చేయడానికి అధికారం ఉంటుంది.

Tags:    

Similar News