Explosion in Fireworks factory: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఏడుగురు మృత

Explosion in Fireworks factory: ఘజియాబాద్‌లో ఆదివారం బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది.

Update: 2020-07-05 15:00 GMT

Explosion in Fireworks factory: ఘజియాబాద్‌లో ఆదివారం బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మోడీ నగర్‌లో ఉన్న ఈ కర్మాగారంలో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. అందులో 10 మంది ఒక రూమ్ లో ఉన్నట్టు గుర్తించారు. అకస్మాత్తుగా పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రజలలో భయాందోళన వాతావరణం ఉంది. పేలుడు శబ్దం చాలా దూరం కిలోమీటరు పైగా వినపడినట్టు స్థానికులు వెల్లడించారు. మంటలు చాలా తీవ్రంగా వ్యాపించాయి, 10 ఫైర్ ఇంజన్లు చాలా సేపు శ్రమించి మంటలను నియంత్రించాయి. ఇక్కడ పనిచేసే వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కర్మాగారంలో చాలా కాలంగా బాణాసంచా తయారవుతోంది.

బర్త్ డే కేకులకు ఉపయోగించే స్పార్క్లర్లు కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఫ్యాక్టరీ యజమాని ముడి పదార్థాలను సమీపంలోని ఇళ్లకు పంపించి పటాకులు తయారు చేయించేవారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకొని ఘటనా స్థలికి చేరుకున్న జిల్లా ఎస్పీ దేహత్ నీరజ్ జాదౌన్, ఎమ్మెల్యే డాక్టర్ మంజు శివాచ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ సింఘాల్‌ను గ్రామస్తులు చుట్టుముట్టారు. మృతదేహాలను తీయడానికి కూడా వారు ఒప్పుకోలేదు. ఇదే కాకుండా, షాహీద్ నగర్ ప్రాంతంలో కూడా ఒక కర్మాగారంలో మంటలు చెలరేగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ పెద్ద ప్రమాదమేమీ జరగలేదని తెలుస్తోంది.


Tags:    

Similar News