Covishield: కోవి షీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచే అవకాశం

Covishield: కోవి షీల్డ్‌ కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచే విషయమై స్టడీ చేయడానికి కేంద్రం ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది.

Update: 2021-05-09 04:59 GMT

Covishield: కోవి షీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధి పెంచే అవకాశం

Covishield: కోవి షీల్డ్‌ కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచే విషయమై స్టడీ చేయడానికి కేంద్రం ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది. కోవి షీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే దాని సామర్థ్యం పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

అన్ని విషయాలను విశ్లేషించి వచ్చే వారమే నివేదిక సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రెండు డోసుల మధ్య ఆరు వారాల వ్యవధి ఉంటే టీకా సామర్థ్యం 55 శాతమే ఉంటుంది. అదే వ్యవధి 12 వారాలకు పెంచితే 81 శాతానికి సామర్థ్యం పెరుగుతుందని అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తెలిపింది. వ్యవధి పెంచడం వల్ల టీకా సామర్థ్యం పెరగడమే గాకుండా కంపెనీల మీద ఒత్తడి కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News