Viral Fever: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న వైరల్ ఫివర్

Viral Fever: భారీ వర్షాలతో విస్తరిస్తున్న జ్వరాలు

Update: 2021-09-08 03:50 GMT
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విష జ్వరాలు (ఫైల్ ఇమేజ్)

Viral Fever: దేశ వ్యాప్తంగా వైరల్ ఫివర్ విజృంభిస్తుంది. విడవకుండా వర్షాలు పడడంతో.. ఒక్కసారిగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడాలలో పిల్లల్లో వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెప్పారు.. వైరల్ జ్వరాలతో రోజుకు 30 మంది పిల్లలు ఆస్పత్రులకు ఓపీడీలో వస్తున్నారని వైద్యులు తెలిపారు. రోగుల్లో 50శాతం మంది పిల్లలకు వైరల్ జ్వరాలు సోకాయని వైద్యులు వివరించారు. దీనికి తోడు ప్రతిరోజు 7 డెంగీ కేసులు కూడా నమోదు అవుతున్నాయని నిపుణులు వెల్లడించారు. పిల్లలు వైరల్ జ్వరాలతో పాటు జలుబు, దగ్గు లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నారని వైద్యుతు తెలిపారు..

మరోవైపు.. ఉత్తరప్రదేశ్ స్ర్కబ్ టైఫస్ జ్వరాలతో 40 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. వారి మరణాలకు డెంగీ కారణమని కేంద్ర వైద్య నిపుణుల టీమ్ వెల్లడించింది. పిల్లలు జ్వరాల బారిన పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Tags:    

Similar News