Exit Poll 2024: లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏ హవా.. మోడీ పాలనకే మళ్లీ పట్టం కట్టిన మెజారిటీ సర్వేలు

Exit Poll 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రాణేవచ్చాయి. మొదటి దశల్లో పోలింగ్ అయిన నియోజకవర్గాల్లో ఫలితాల కోసం అభ్యర్థుల కంటే ఓటర్లే ఎక్కువగా టెన్షన్ పడ్డారు.

Update: 2024-06-01 13:49 GMT

Exit Poll 2024: లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏ హవా.. మోడీ పాలనకే మళ్లీ పట్టం కట్టిన మెజారిటీ సర్వేలు

Exit Poll 2024: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రాణేవచ్చాయి. మొదటి దశల్లో పోలింగ్ అయిన నియోజకవర్గాల్లో ఫలితాల కోసం అభ్యర్థుల కంటే ఓటర్లే ఎక్కువగా టెన్షన్ పడ్డారు. సుమారు నెలన్నర రోజులుగా జరిగిన సార్వత్రిక సమరంలో ఎవరిని గెలుపు వరిస్తోందో అన్న ఉత్కంఠ నెలకొంది. కాసేపటి క్రితమే చివరి విడత పోలింగ్ ముగియడంతో అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. ఎన్నో రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడినట్లు అయింది.

మోడీ 3.0కే మెజారిటీ సర్వే సంస్థలు మొగ్గుచూపాయి. మోడీ ఓటమే లక్ష్యంగా కూటమి కట్టిన పార్టీలకు మరోసారి భంగపాటు తప్పదని వెల్లడించాయి. హ్యాట్రిక్ విజయాన్ని మోడీ కైవసం చేసుకోనున్నారని తెలిపాయి. మోడీ విజయంలో రామ మందిర అంశం ఎక్కువగా అనుకూలించిందని సర్వే సంస్థలు అభిప్రాయపడ్డాయి. మోడీ మేనియా ముందు ఇండియా కూటమి వ్యూహత్మక ప్రచారం బెడిసికొట్టిందని సర్వే సంస్థల చెబుతున్న మాట. ఏడు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీకే హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తున్నారు. రాజ్యంగం ప్రమాదంలో ఉంది... రిజర్వేషన్లు రద్దు వంటి అంశాలను విపక్ష కూటమి లేవనెత్తినా ప్రజలు వారి మాటలు విశ్వసించలేదన్నాయి.

రిపబ్లిక్‌-పీమార్క్‌, ఇండియా న్యూస్‌-డీ డైనమిక్స్‌, రిపబ్లిక్‌ భారత్‌-మ్యాట్రిజ్‌ చేసిన సర్వేలు 300లకు పైగా స్థానాల్లో కాషాయ పార్టీదే గెలుపు అని చెబుతున్నాయి.

రిపబ్లిక్‌ టీవీ- PMARQ సర్వే

ఎన్డీయే కూటమికి 359 సీట్లు

ఇండియా కూటమికి 154 సీట్లు

ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం

ఇండియా న్యూస్‌ - డీ డైనమిక్స్‌ సర్వే

ఎన్డీయే- 371

ఇండియా - 125

ఇతరులు - 47

మ్యాట్రిజ్‌ సర్వే

ఎన్డీయేకు 353- 368

ఇండియా 118-133

ఇతరులు 43-48

జన్‌కీబాత్‌ సర్వే..

ఎన్డీయే 362- 392

ఇండియా కూటమి 141-161

ఇతరులు - 10-20

న్యూస్‌ నేషన్‌ సర్వే

ఎన్డీయే: 342-378

ఇండియా కూటమి: 153-169

ఇతరులు: 21-23

Tags:    

Similar News