బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్.. కాంగ్రెస్‌కు షాక్..
Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి.
Punjab: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడిపుట్టిస్తున్నాయి. కీలక నేతలతో పాటు ప్రముఖులను సైతం లాగేందుకు పార్టీలు పోటీపడుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ మోంగియా బీజేపీ కండువా కప్పుకున్నారు. అలాగే పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటు నిరాకరణతో బీజేపీలో చేరిపోయారు. ఫతేహ్ జంగ్ బజ్వా, బల్వీందర్ సింగ్, రానా గుర్మీత్ సైతం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి గజేంద్ర సింగ్ షెకావత్, ఇతర కీలక నేతల సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు.