Assam: అసోంలో ఈవీఎంను తరలించిన బీజేపీ అభ్యర్థి

Assam: అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను ప్రైవేటు కారులో తరలించడం వివాదానికి దారి తీసింది.

Update: 2021-04-02 15:30 GMT

Assam: అసోంలో ఈవీఎంను తరలించిన బీజేపీ అభ్యర్థి

Assam: అసోంలో రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఓ ఈవీఎంను ప్రైవేటు కారులో తరలించడం వివాదానికి దారి తీసింది. బీజేపీ అభ్యర్థి కారులో ఆ ఈవీఎంను తరలించినట్లు ఆరోపణలు రావడంతో ఈసీ స్పందించి, నలుగురు పోలింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈవీఎం భద్రంగానే ఉందని, దీనికి వేసిన సీలు చెక్కు చెదరలేదని వివరించింది.

రటబరి నియోజకవర్గంలోని ఓ కేంద్రంలో పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంను బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు పాల్ కారులో తరలించినట్లు తెలిసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈవీఎంను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించే కారు చెడిపోవడంతో రోడ్డు మీద వెళుతున్న ఒక కారును ఆపారని ఆ కారు బీజేపీ నేతకు చెందినదని ఆ తర్వాత తెలిసిందని స్థానిక మీడియా వెల్లడించింది.

Tags:    

Similar News