Gujarat Elections 2022: గుజరాత్లో రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
Gujarat Elections 2022: ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని.. 93 నియోజకవర్గాలకు రేపు పోలింగ్
Gujarat Elections 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 182 స్థానాలుండగా.. ఈనెల ఒకటిన 89స్థానాల్లో ఓటింగ్ పూర్తయింది. మిగతా 93 స్థానాలకుగానూ.. అన్ని పార్టీల తరపున 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 26వేల409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో విడత పోలింగ్ కోసం 36వేలకు పైగా ఈవీఎంలు వినియోగిస్తుండగా లక్షా13వేల325 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. రేపటి గుజరాత్ రెండోదశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి ఆప్ బరిలో ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది.