Indo-American Relations: భారత్‌తో సంబంధాలపై బైడెన్ ఫోకస్
Indo-American Relations: భారత్ లో కొత్త రాయబారిగా ఎరిక్ గర్సెట్టి ని నియమించేందుకు జోబైడెన్ యోచిస్తున్నట్లు సమాచారం.
Indo-American Relations: అధికార మార్పిడి జరిగినప్పుడల్లా.. పదవుల్లోని మనుషులు మారిపోవటం మన భారతదేశంలోనే కాదు.. అమెరికాలో కూడా జరుగుతుంది. రాజకీయ అవసరాలు అలా ఉంటాయి మరి. ట్రంప్ పోయి... బైడెన్ వచ్చాక అలాంటి మార్పులు చాలా జరిగాయి అమెరికాలో. ఇప్పుడు లేటెస్టుగా భారత్ లోని రాయబారిని సైతం మార్చాలని బైడెన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉండగా మోదీ చాలా క్లోజ్ గానే మూవ్ అయ్యారు. తర్వాత బైడెన్ వచ్చాక మోదీకి వ్యక్తిగతంగా కన్నా.. భారత్ కు ఒక దేశంగా.. ఆసియాలో వ్యూహాత్మకంగా ఉండేలా .. సంబంధాలు మెరుగుపర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
తనకు రాజకీయంగా నమ్మకస్తుడైన ఈయనకు ఈ పదవిని అప్పగించాలన్న ప్రతిపాదన ఉందని బైడెన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎరిక్ నియామకం గురించి బైడెన్ వచ్చేవారం ప్రకటించే సూచనలున్నాయి. అలాగే చైనాకు తమ దేశ రాయబారిగా నికోలస్ బర్న్స్ , జపాన్ కు రాహమ్ ఇమాన్యుయెల్, ఇజ్రాయెల్ కి టామ్ నైడ్స్ ని నియమించవచ్చునని భావిస్తున్నారు. వీరిలో పలువురు బైడెన్ కి విశ్వాస పాత్రులు… 50 ఏళ్ళ ఎరిక్… బైడెన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు.
ఆయనతో బాటు పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. మొదట ఆయనను కేబినెట్ లోకి తీసుకోవాలనుకున్నారని తెలిసింది. ఇండియాకు అమెరికా భారత రాయబారి పోస్టు జనవరి నుంచి ఖాళీగా ఉంది. తాత్కాలిక రాయబారిగా ఫారిన్ సర్వీస్ ఇన్స్ టిట్యూట్ డైరెక్టర్ డేనియల్ స్మిత్ ను నియమించినప్పటికీ పూర్తి స్థాయి రాయబారి లేరని బైడెన్ ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఎరిక్, బుర్న్స్ నియామకాలపై వ్యాఖ్యానించేందుకు వైట్ హౌస్ నిరాకరించింది. మొదట ఈ ప్రతిపాదనలను సెనేట్ ధృవీకరించాల్సి ఉందని బైడెన్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.