పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. నెలవారీ కనీస పెన్షన్ పెరిగే అవకాశాలు..!
EPFO: కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మార్పులు చేయడం అవసరమని సూచించింది...
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (epfo) పెన్షన్ స్కీమ్ కింద చందాదారులకు చెల్లించే రూ.1,000 చాలా తక్కువని పార్లమెంటు కమిటీ నిర్ణయించింది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ ముందుకు తీసుకెళ్లడం అవసరమని భావించింది. దీనివల్ల 7 కోట్ల మంది పీఎఫ్ హోల్డర్లకి లబ్ధి జరుగుతుంది. 2022-23 గ్రాంట్ల డిమాండ్‌పై పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ "ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించిన రూ. 1,000 నెలవారీ పెన్షన్ ఇప్పుడు చాలా తక్కువగా ఉంది" అని పేర్కొంది.
పార్లమెంటరీ కమిటీ ప్రకారం.. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మార్పులు చేయడం అవసరమని సూచించింది. కనీస పెన్షన్ రూ.2,000కు పెంచాలని సిఫార్సు EPFO అన్ని పెన్షన్ పథకాలను నిపుణుల ద్వారా మూల్యాంకనం చేయించాలి. తర్వాత నెలవారీ సభ్యుల పెన్షన్‌ను తగిన మేరకు పెంచవచ్చు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995ని మూల్యాంకనం చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ 2018 సంవత్సరంలో అధిక-పవర్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
సభ్యులు/వితంతు/వితంతు పింఛనుదారులకు కనీస నెలవారీ పెన్షన్‌ను రూ.2,000కు పెంచాలని కమిటీ నివేదికలో సిఫార్సు చేసింది. ఇందుకు అవసరమైన వార్షిక బడ్జెట్ కేటాయింపులు చేయాలని సూచించింది.అయితే కనీస నెలవారీ పింఛను రూ.1000 నుంచి పెంచేందుకు ఆర్థిక శాఖ అంగీకరించలేదు. పార్లమెంటరీ కమిటీ ప్రకారం చాలా కమిటీలు దీనిపై వివరంగా చర్చించాయి.
నిపుణుల నుంచి EPFO పెన్షన్ స్కీమ్ మిగులు / లోటు గురించి సరైన అంచనా లేకపోతే నెలవారీ పెన్షన్‌ను సమీక్షించడం సాధ్యం కాదని తెలిపింది. ముఖ్యంగా 2015కి ముందు రిటైర్మెంట్ వారు 'ఈ-నామినేషన్' కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది. దీంతో పాటు 'ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ పోర్టల్' (OTCP) పనితీరులో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సూచించింది.