Enforcement Directorate Team At Ahmed Patel House:అహ్మ‌ద్ ప‌టేల్ ఇంటికి ఈడీ అధికారులు

Enforcement Directorate Team At Ahmed Patel House: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, పార్టీ కోశాధికారి అహ్మ‌ద్ ప‌టేల్‌ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు వచ్చారు.

Update: 2020-06-27 09:35 GMT
Ahmmed patel (file photo)

Enforcement Directorate Team At Ahmed Patel's House: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, పార్టీ కోశాధికారి అహ్మ‌ద్ ప‌టేల్‌ ఇంటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు వచ్చారు. స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అహ్మద్ పటేల్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసేందుకు ఈడీ బృందం శనివారం ఆయన నివాసానికి వచ్చింది. ఈ కేసు విషయంలో ఆయనకు ఇదివరకే నోటీసులు ఇచ్చారు. కాని కోవిడ్ -19 మార్గదర్శకాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని.. కరోనావైరస్ మహమ్మారి నుండి తమను తాము రక్షించుకోవడానికి 65 ఏళ్లు పైబడిన వారు ఇంట్లో ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చిందని ఈడీకి తెలిపారు. దాంతో ఈడీ ఆయన స్టేమెంట్ ను రికార్డు చేయలేదు. ఈ క్రమంలో అధికారులు ఆయ‌న నివాసానికి వెళ్లారు.

ఆంధ్ర బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నుంచి స్టెర్లింగ్ బయోటెక్ రూ .5 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భారీ ఎత్తున అవకతవకలు ఉన్నట్టు ఈడీ గుర్తించించింది.స్టెర్లింగ్ బ‌యోటెక్ లిమిటెడ్ ప్ర‌మోట‌ర్లు సందేశ‌ర సోద‌రులు నితిన్, చేతన్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు, అయితే వీరు నైజీరియాలో తలదాచుకున్నారు వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత ఏజెన్సీలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియంను మోసం చేశాడనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు రతుల్ పూరీకి సంబంధించిన పలు సంస్థల్లో శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహించింది. ఇందుకు సంబంధించి పలు డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకుంది. 





Tags:    

Similar News