పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు... ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని అవంతిపురలో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని తనిఖీలు ప్రాంబించారు.

Update: 2019-10-08 09:28 GMT

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని అవంతిపురలో ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని తనిఖీలు ప్రాంబించారు. బలగాల కదలికలు గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాబలగాలకు ఉగ్రవాదులకు భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. కశ్మీర్‌లో 300మందిపైగా ముష్కరులు ఉన్నట్లు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ప్రకటించారు. దీంతో భారీగా సైనిక బలగాల్ని తరలించిచారు. ఘటనా స్థలంలో భారీగా తుపాలకులు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Tags:    

Similar News