Encounter in Kashmir's Shopian District: కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత.. ముగ్గురు ఉగ్రవాదుల ఏరివేత
Encounter in Kashmir's Shopian District: దక్షిణ కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది.
Encounter in Kashmir's Shopian District: దక్షిణ కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. ముష్కరుల ఏరివేత కొనసాగుతోంది. షోపియన్ జిల్లాలోని అమ్షిపోరా గ్రామంలో శనివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన కాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అమ్షిపోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసు, ఆర్మీ యొక్క 62 ఆర్ఆర్ మరియు సిఆర్పిఎఫ్ సంయుక్త బృందం.. నిర్దిష్ట సమాచారంపై కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే ఉగ్రవాదులు తప్పించుకునే క్రమంలో భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇది ఎన్కౌంటర్ కు దారితీసింది. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు.
కాశ్మీర్‌లో గత 24 గంటల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన రెండవ ఎన్‌కౌంటర్ ఇది. కాశ్మీర్ కుల్గం జిల్లాలో శుక్రవారం ఉదయం ముగ్గురు జైష్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఏడాది కాశ్మీర్‌లో వివిధ ఉగ్రవాద గ్రూపుల అగ్ర కమాండర్లతో సహా జమ్మూ కాశ్మీర్‌లో వివిధ కార్యకలాపాల్లో కనీసం 133 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఇక కాశ్మీర్ లో వరుసగా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. రెండు మూడు రోజుల వ్యవధిలో ఒక ఎన్‌కౌంటర్ జరగడం సాధారణంగా మారింది. అయినా ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. దీంతో భద్రతా చేతిలో హతమవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలనుంచి అధిక సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు.