Assembly Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి

Assembly Elections: గట్టి పోటీ ఉందనుకున్న నియోజకవర్గాల్లో విస్తృతంగా అగ్రనేతలు

Update: 2023-11-27 13:09 GMT

Assembly Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి

Assembly Elections: తెలంగాణలో ఢిల్లీ నేతలు మకాం వేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయి. ఇక తెలంగాణ మాత్రమే మిగిలింది. అన్ని పార్టీల నేతలు తెలంగాణలో దిగిపోయారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా అందరూ తెలంగాణలోనే తిరుగుతున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

ఈనెల 28న సాయంత్రం వరకూ ప్రచార గడువు ఉంది. ప్రచారానికి మరో రెండు రోజులే సమయం ఉండటంతో జాతీయ పార్టీల అగ్రనేతలంతా తెలంగాణలోనే మకాం వేశారు. కాసేపట్లో ప్రధాని మోడీ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారు. ప్రియాంక, రాహుల్ రేపటి వరకు తెలంగాణలో పర్యటించనున్నారు. గట్టి పోటీ ఉందనుకున్న నియోజకవర్గాల్లో అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.

తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జగిత్యాల, బోధన్, బాన్స్ వాడ, జుక్కల్ సభల్లో పాల్గొననున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా హుజురాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ దేవరకొండ, మంథని, పరకాల, వరంగల్, దుబ్బాక ప్రచారంలో పాల్గొంటారు.

తెలంగాణలో గెలిచి పట్టు సాధించాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నర్సాపూర్ ప్రచారం సభలో పాల్గొనున్నారు. ఏఐసీసీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు.

Tags:    

Similar News