మరికొన్ని గంటల్లో భారత రాష్ట్రపతి ఎన్నిక
President Election: బరిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా
President Election: మరికొన్ని గంటల్లో భారత రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. బరిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇద్దరే అభ్యర్థులు ఉండటంతో.. దేశానికి తదుపరి రాష్ట్రపతి ఎవరన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు తెలంగాణ అసెంబ్లీ అధికారులు. టీఎస్ అసెంబ్లీ కమిటీ హాల్-2లో ఓటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం 8 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల సమక్షంలో ఈ రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి పంపించనున్నారు. ఈ నెల 21న ఫలితాలను వెల్లడించనున్నారు.