Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. ఐదురాష్ట్రాల్లో ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం
Election Commission: నవంబర్ 7 నుంచి 30 వరకు అమలులో ఉండనున్న నిషేధం
Election Commission: ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం విధించింది. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, మిజోరం, తెలంగాణ, మధ‌్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నిషేధం అమలులో ఉంటుందని ఈసీ పేర్కొంది. నవంబర్ 7 నుంచి 30 తేదీ సాయంత్రం 6.30 గంటల వరకూ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A ప్రకారం ఏ వ్యక్తైనా.. ఎటువంటి ఎగ్జిట్ పోల్ నిర్వహించకూడదని.. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించకూడదని.. ఎలాంటి ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా ఉంటుందని.. రెండింటితోనూ శిక్షించే అవకాశం ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.