Election Commission Postponed by Poll in India: పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా

Update: 2020-07-23 13:11 GMT

Election Commission Postponed by Poll in India: భారతదేశంలో కొనసాగుతున్న అంటువ్యాధి పరిస్థితి మరియు వరదలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ఈ ఏడాది ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం జరగాల్సిన ఉపఎన్నికలు వాయిదా వేసింది. ఉప ఎన్నికలు సెప్టెంబర్‌ 7 వరకు నిర్వహించాల్సి ఉంది.. తాజాగా ఎన్నికల సంఘం ప్రకటనతో అస్సాం, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలు వాయిదా పడ్డాయి. పరిస్థితులు అనుకూలమైన వెంటనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.

బీహార్ (వాల్మీకి నగర్ పిసి), అస్సాం (సిబ్సాగర్), తమిళనాడు (తిరువొట్టియూర్ , గుడియట్టం (ఎస్సీ)), మధ్యప్రదేశ్ (అగర్ (ఎస్సీ), ఉత్తర ప్రదేశ్ (బులంద్‌షహార్ , తుండ్లా) , కేరళ (చవరా) లో కలిపి మొత్తం ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం, శాసనసభ పదవీకాలం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం మిగిలి ఉంటే, ఖాళీ అయిన తేదీనుంచి ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి.

కాగా దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా వైరస్ నుంచి పరిస్థితి మెరుగుపడలేదని ఇఎస్‌ఐ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితిలో, ఎన్నికలు నిర్వహించడం పౌరుడి ఆరోగ్యానికి మరియు భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షపాతం మరియు వరదలు వచ్చాయి. దీంతో యంత్రాంగం వరద నియంత్రణ మరియు ఉపశమన పనులలో పాల్గొంటుంది.    

Tags:    

Similar News