ఏక్ నాథ్ షిండే, ఉద్దవ్ ఠాక్రే వర్గాలకు షాకిచ్చిన ఈసీ.. శివసేన సింబల్ ఫ్రీజ్..
Election Commission: ఉద్ధవ్ థాకరే-ఏక్ నాథ్ షిండే వర్గాల ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Election Commission: ఉద్ధవ్ థాకరే-ఏక్ నాథ్ షిండే వర్గాల ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి నోటీసు ఇచ్చే వరకు శివసేన పార్టీ 'విల్లు మరియు బాణం' గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. దీంతో ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లో జరగబోయే ఉప ఎన్నికలో మరో గుర్తును ఉపయోగించాల్సి ఉంటుంది. ఉప ఎన్నికకు రేపటిలోగా కొత్త సింబల్‌ను సెలెక్ట్ చేసుకోవాలని షిండే, ఉద్ధవ్ వర్గాలకు ఈసీ సూచించింది. ఈ రెండు వర్గాలు జూన్‌లో విడిపోయినప్పటి నుండి, అసలు శివసేన'గా తమను ప్రకటించాలని పోరాడుతున్నాయి.