Karnataka Election: మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

Karnataka Assembly Election: దేశంలో మరో ఎన్నికకు నగారా మోగింది.

Update: 2023-03-29 06:53 GMT

Karnataka Election: మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

వృద్ధులకు ఇంటి నుంచే ఓటు.. రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈసీ తొలిసారిగా 'ఓటు ఫ్రమ్‌ హోం' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఇంటి నుంచే ఓటు వేయొచ్చిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.




 


Tags:    

Similar News