Eight policemen killed : పోలీసులపై రౌడీషీటర్ల కాల్పులు.. డీఎస్పీ సహా 8 మంది మృతి

Update: 2020-07-03 02:47 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రౌడీషీటర్ల కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. రౌడీ షీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు పోలీసుల బృందం కాన్పూర్‌ వెళ్లింది. వారిపై నేరస్తులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎనిమిదిమంది పోలీసులు మరణించడంతోపాటు మరో నలుగురు గాయపడ్డారు.

పోలీసులపై కాల్పులు జరిపిన క్రిమినల్స్‌ అక్కడి నుంచి పారిపోయారు. రౌడీషీటర్‌ వికాస్‌దూబేపై 60కిపైగా కేసులు ఉన్నాయి. కాల్పుల విషయం తెలుకున్న ఎస్‌ఎస్‌పీతోపాటు ఐజీ, ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పోలీసులు రౌడీముఠా కోసం గాలింపు చేపట్టారు. పోలీసులను చంపిన నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీజీపీ హెచ్ సీ అవస్థీని ఆదేశించారు. పోలీసుల మృతిపై సీఎం సంతాపం తెలిపారు.  

 

Tags:    

Similar News