Egg Seller in Indore: వంద రూపాయల లంచం ఇవ్వనందుకు కోడిగుడ్ల బండిని తోసేశారు
Egg Seller in Indore: కరోనా వలన వలసకూలీలతో సహా చాలా మంది ఇబ్బంది పడ్డారు.
Egg Seller in Indore: కరోనా వలన వలసకూలీలతో సహా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇక చిరు వ్యాపారాలు అయితే బాగానే నష్టపోయారు. కేవలం ప్రభుత్వం సూచించిన సమయంలోనే విక్రయాలు జరపడం లాంటి నిబంధనలను.ఇప్పటికే పలు రాష్ట్రాలు విధించాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో దుకాణాలను తెరవడానికి కుడి - ఎడమ పద్ధతిని అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం.. అంటే రోజు విడిచి రోజు విక్రయాలను జరుపుకోవాలని అన్నమాట!
అందులో భాగంగా గురువారం గుడ్లు విక్రయిస్తున్న ఓ 14 ఏళ్ల బాలుడి బండిని అధికారులు బోల్తా కొట్టారు. రోడ్డు పైన గుడ్లను విక్రయిస్తున్న ఆ బాలుడిని అక్కడ్నుంచి బండిని తీసివేయాలని, లేదంటే వందరూపాయల లంచం ఇవ్వాలని అధికారులు ఆ బాలుడిని డిమాండ్ చేశారు. అయితే దానికి ఆ బాలుడు తోపుడు బండిని తీసేయను.. లంచం ఇవ్వను అని అధికారులకి తెగేసి చెప్పేశాడు.దీనితో ఆగ్రహానికి గురైనా అధికారులు అతడి తోపుడు బండిని తోసేశారు. దీనితో గుడ్లన్నీ రోడ్డుపాలయ్యాయి. అధికారుల తీరుపైన ఆ బాలుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పైన ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్పందించారు.
కుడి - ఎడమ పద్ధతిని తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక నెటిజన్లు కూడా ఈ వీడియో పైన తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇక కరోనా వలన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత నష్టపోయిన నగరములలో ఇండోర్ ఒకటి... తాజాగా అక్కడ ప్రభుత్వం ఎడమ మరియు కుడి వైపున ఉన్న దుకాణాలను ప్రత్యామ్నాయ రోజులలో తెరవడానికి అనుమతిని ఇచ్చింది.