ED Raids on Ashok Gehlot's brother Home: ముఖ్యమంత్రి గెహ్లాట్ సోదరుడి ఇంటిపై ఈడీ దాడులు
ED Raids on Ashok Gehlot's brother Home: ఎరువుల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇల్లు, ఫామ్ హౌస్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు నిర్వహిస్తుంది.
ED Raids on Ashok Gehlot's brother Home: ఎరువుల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇల్లు, ఫామ్ హౌస్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు నిర్వహిస్తుంది. జోధాపూర్ పలు కీలక డాక్యూమెంట్లను పరిశీలిస్తోంది. రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. కరోనా నేపథ్యంలో ఈడీ అధికారుల బృందం PPE కిట్ లు ధరించి శోధనకు వచ్చారు. ప్రస్తుతం ఇంకా శోధన ప్రక్రియ కొనసాగుతోందని ఈడీ అధికారులు చెప్పారు.
కాగా అంతకుముందు, ఆదాయపు పన్ను శాఖ మరియు ఈడీ.. ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. తమ పార్టీని బెదిరించడానికి ఈడీ దాడులు నిర్వహిస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వానికి సత్తా ఉంటే ఆయన ప్రజాభిప్రాయాన్ని కోరాలని సవాలు చేశారు. జూలై 20 మరియు 21 తేదీలలో సిబిఐని ఎమ్మెల్యే కృష్ణ పూనియా ఇంటికి పంపించారని.. ఆ తరువాత ఆదాయపు పన్ను మరియు ఈడీని పంపారని అన్నారు.
ఢిల్లీలో ఉన్న పాలకులకు ఒత్తిడి మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు అధికారులు మాత్రం రొటీన్ ప్రక్రియలో భాగంగానే అన్ని ప్రాంతాలల్లో దాడులు నిర్వహిస్తున్నామని రాజకీయ ఒత్తిళ్లు లేవని అంటున్నారు. అసలే ఎమ్మెల్యేలు చేజారిపోతుండటంతో వారిని దారికి తెచ్చుకునే పనిలోపడిన కాంగ్రెస్ కు గోరుచుట్టు రోకటిపోటులా ఈడీ దాడులు వచ్చాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈడీ దాడుల నేపథ్యంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు చేజారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.