Arvind Kejriwal: ఈడీ విచారణ... కేజ్రీవాల్ హాజరుపై ఉత్కంఠ
Arvind Kejriwal: ఢిల్లీ జల్‌బోర్డ్ స్కాంలో విచారణకు రావాలని ఆదేశం
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ జల్‌బోర్డులో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించిన కేసులో ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. పీఎంఎల్యాక్ట్ కింద కేజ్రీవాల్‌పై ఇప్పటికే ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ తొమ్మిదోసారి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.
ఈ నెల 21న ఈడీ హెడ్ ఆఫీస్‌లో విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు 8 సార్లు ఈడీ నోటీసులను కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. తమ నోటీసులను కేజ్రీవాల్ బేఖాతరు చేస్తున్నారని రౌజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఇచ్చిన మరుసటి రోజే, రెండు వేరు వేరు కేసుల్లో వేరు వేరు తేదీల్లో విచారణకు రావాలని ఈడీ నోటీసులిచ్చింది. తాజాగా ఈడీ ఆఫీసులో కేజ్రీవాల్ విచారణకు హాజరవ్వడంపై ఉత్కంఠ నెలకొంది.