ED: లోన్ యాప్‌లపై దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
ED: లోన్ల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా
ED: లోన్ పేరిట మోసాలకు పాల్పడుతోన్న ఆన్‌లైన్ యాప్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ పెట్టింది. యాప్ నిర్వాహకులను పట్టుకునేందుకు నిఘా పెంచింది ఈడీ. బెంగళూరు కేంద్రంగా లోన్‌యాప్‌ల పేరిట నిందితులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే తెలంగాణలోని జనగామ, కాజీపేటతో పాటు 19ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఎన్‌బీఎఫ్‌సీ అనుమతులు లేకుండా లోన్స్ మంజూరు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.
లోన్‌యాప్ పేరిట ఫొటోలో మార్ఫింగ్ చేసి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. సోషల్‌మీడియాలో ఫొటోలు పబ్లిష్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లోన్ యాప్ మోసాల కేసులో ఇప్పటివరకు 19 కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఈడీ అధికారులు. లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులతో అమాయకులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. లోన్‌యాప్ దారుణాలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన ఈడీ..మోసాలకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెంచింది.