Delhi Liquor Scam: ఈనెల 17వరకు సిసోడియాకు ఈడీ కస్టడీ పొడిగింపు
Delhi Liquor Scam: కీలక నిందితుడిగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఈడీ అధికారులు దూకుడు మీదున్నారు. ఈ స్కామ్ లో కీలక నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు సంచలన విషయాలు పేర్కొన్నారు. సిసోడియా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు పలుమార్లు ప్రస్తావించారు. ఇండో స్పిరిట్ పెట్టుబడులపై రామచంద్ర పిళ్లై ఇచ్చిన వివరణను ఈడీ అధికారులు ప్రస్తావించారు.
ఈ స్కామ్ మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని తేల్చారు. ఐటీసీ కోహినూర్ హోటల్ లోనే కీలక చర్చలు జరిగాయని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిందని ఈడీ అధికారులు చెబుతున్న సౌత్ గ్రూప్ ప్రతినిధులు మరో నిందితుడు దినేష్ అరోరాను హైదరాబాద్ కు పిలిచింది. ఈ క్రమంలో 100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయని ఈడీ అభియోగం మోపింది. సిసోడియాను ఏడురోజులు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. మార్చి 17 వరకు సిసోడియా ఈడీ కస్టడీలో ఉండనున్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.