యువతకు సమ్మోహన మంత్రంగా మారుతున్న చాయ్ వాలా నినాదం

Chaiwala: బీహార్ లో చదివిన కాలేజీ ముందే ఓ యువతి టీ దుకాణం

Update: 2022-04-21 04:00 GMT

యువతకు సమ్మోహన మంత్రంగా మారుతున్న చాయ్ వాలా నినాదం

Chaiwala: అధికారంలోకి రాడానికి మోడీ పఠించిన సమ్మోహన మంత్రం ఇప్పుడు యువతకి సక్సెస్ మంత్రాగా మారుతోంది. ఉద్యోగం రాలేదన్న దిగులు లేదు సంపాదన లేదన్న ఆందోళన అక్కర లేదు వేలు,లక్షలు పోసి ఉద్యోగాలను, సీట్లను కొనుక్కోలేకపోతున్నామన్న నిరాశ అక్కర లేదు నిరుద్యోగ యువత ఇప్పుడు ట్రెండ్ మార్చేసింది. సాక్షాత్తు దేశ ప్రధాని ఇచ్చిన ఇన్ స్పిరేష్ తో రెండు చేతులా ఆర్జించేస్తున్నారు. ఇంతకీ మోడీ ఇచ్చిన ఆ సక్సెస్ టిప్ ఏంటి?

చాయ్ గరమ్ చాయ్ విసుగెత్తిపోయిన బ్రెయిన్ కు రిలాక్సేషన్ అందించే పానీయం అలసిన మనసుకు స్వాంతన నిచ్చే ఓ గమ్మత్తైన ఔషధం లాంటిది.. ఇప్పుడిది ఉపాధి మార్గంగా కూడా మారిపోయింది. సాక్షాత్తూ దేశ ప్రధానే తాను చాయ్ వాలాను అని చెప్పుకుని చాయ్ కి ఎక్కడ లేని హైప్ కల్పించారు మోడీ సక్సెస్ మంత్రా ఇప్పుడు యువతకు కిక్కిచ్చే మంత్రంగా మారిపోయింది. పెద్ద పెద్ద చదువులు ఎందుకు దండగ హాయిగా చాయ్ అమ్ముకో నిండుగా అంటున్నారు నేటి తరం యువత.

బీహార్ లోని పుర్నియా ప్రాంతానికి చెందిన ప్రియాంకా గుప్తా ఇదే బాట పట్టింది. 2019లో ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఈ యువతి అప్పటినుంచి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించింది.లెక్క లేనన్నిపోటీ పరీక్షలు రాసింది. జాబ్స్ కోసం ఎన్నో ఎంట్రన్స్ టెస్టులు రాసింది. అవేవీ ఫలితాలను ఇవ్వకపోవడంతో తాను కూడా మోడీలాగా చాయ్ వాలాగా మారాలనుకుంది. ఎందరో చాయ్ వాలాస్ ఉన్నారు . చాయ్ వాలీగా నేనుంటే తప్పేంటి అన్న ఆలోచనతో పాట్నాలో తాను చదివిన కాలేజీ ఎదురుగానే టీ దుకాణం పెట్టింది. తన టీ స్టాల్ లో నాలుగు రకాల టీలు అమ్ముతోంది ప్రియాంక మోడీ ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ పిలుపు తనను ఈ దిశగా ప్రేరేపించిందంటోందీ అమ్మాయి. చాయ్ స్టాల్ పెట్టడానికి తన ఫ్రెండ్ దగ్గర నుంచి 30 వేలు అప్పు తీసుకుంది. దశల వారీగా ఆ అప్పును తీరుస్తోంది.

ప్రియాంకకు ఈ బిజినెస్ లోకి రాడానికి మరో చాయ్ వాలా ప్రఫుల్ బిల్లోర్ ఇన్ స్పిరేషన్ అట మధ్యప్రదేశ్ కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ కు ఎంబీఏ చదివి మంచి వ్యాపార వేత్త కావాలని కోరిక కానీ క్యాట్ పరీక్షలో పాస్ కాలేదు. దాంతో నిరాశ చెందకుండా టీ స్టాల్ తెరిచాడు. ప్రఫుల్ బిల్లోర్ ఇప్పుడు దేశంలోనే సంపన్న చాయ్ వాలాగా మారాడు. దేశవ్యాప్తంగా అతగాడికి 22 ఔట్ లెట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగానూ కాలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు ప్రఫుల్ బిల్లోర్ చదువుకుంటానంటూ తండ్రినుంచి పదివేలు అప్పుగా తీసుకున్న బిల్లోర్ వాటితో చాయ్ కెటిల్స్, ఇతర వంట సామాగ్రి కొన్నాడు.తాను చదవాలనుకున్న అహ్మదాబాద్ ఐఐఎం కాలేజ్ ముందే టీ అమ్మడం మొదలు పెట్టాడు. ఏడాది తిరగకుండానే డబ్బు, క్రేజు బాగా సంపాదించాడు.

ఇక బెంగాల్ దుర్గాపూర్ కు చెందిన ఇద్దరు ఇంజనీర్ బ్రదర్స్ చాయ్ బిజినెస్ కోసం బంగారంలాంటి ఇంజనీరింగ్ ఉద్యోగాలనే వదిలేశారు. ఉద్యోగిగా సంపాదించే నెల జీతం కన్నా టీ అమ్ముకోడం ద్వారా వచ్చే ఆదాయమే సాలిడ్ గా ఉండటంతో వారు ఉద్యోగాలకి గుడ్ బై కొట్టేశారు. 

Tags:    

Similar News