జార్ఖండ్ గవర్నర్ సంచలన నిర్ణయం.. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు
Hemant Soren: జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తూ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Hemant Soren: జార్ఘండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తూ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడంతో జార్ఘండ్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభంలో పడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. తనకు తానే మైనింగ్ కేటాయించుకున్నారని సీఎం హేమంత్ సోరెన్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోరెన్ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఈసీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఈసీ సిఫార్సు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేయడంతో తదుపరి సీఎం రేసులో సోరెన్ సతీమణి ఉన్నట్లు తెలుస్తోంది.