Gujarat Assembly Election 2022: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

*గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు

Update: 2022-11-03 07:51 GMT

Gujarat Assembly Election 2022: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Gujarat Assembly Election 2022: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబర్ 5న రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజకవర్గా్ల్లో పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. తొలి దశ ఎన్నికలకు నవంబర్ 5 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబర్ 15న నామినేషన్లు పరిశీలిస్తారు. నవంబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహ‌రణకు గడువు ఉంటుంది.

డిసెంబర్ 1న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. రెండో దశ ఎన్నికలకు 10 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నవంబర్ 17వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఉంది. నవంబర్ 18న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల విత్‌ డ్రాకు నవంబర్ 21 వరకు గడువు ఉంటుంది. డిసెంబర్ 5న రెండోదశ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. గుజరాత్‌ లో మొత్తం 182 స్థానాలున్నాయి. గుజరాత్‌లో 142 జనరల్, 17ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. గుజరాత్‌లో 4కోట్ల 90లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 

Full View


Tags:    

Similar News