E Shram:'ఈ శ్రమ్'లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు జాగ్రత్త.. 2 లక్షలు కోల్పోయే ప్రమాదం..!
E Shram: ఈ శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు జాగ్రత్త.
E Shram: ఈ శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు జాగ్రత్త. ఎందుకంటే ఈ పథకం పేరు చెప్పి ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల మంది ఇందులో పేరు నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇటీవల ఈ పోర్టల్‌కు సంబంధించి అనేక రకాల మోసాలు తెరపైకి వచ్చాయి. అందుకే పీఐబీ ( Press Information Bureau) వినియోగదారులని హెచ్చరిస్తోంది.
ఈ శ్రమ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారిక సైట్‌ని మాత్రమే ఉపయోగించాలి. అందులో నుంచి మాత్రమే నమోదు చేసుకోవాలని సూచించింది. ఇది కాకుండా మరే ఇతర లింక్ ద్వారా ఈ పోర్టల్‌లో నమోదు చేయవద్దని హెచ్చరించింది. అంతేకాదు ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేటప్పుడు మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఈ-శ్రమ్ అధికారిక పోర్టల్‌ను మాత్రమే సందర్శించాలని కోరింది.
ఈ శ్రమ్ అనేది దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులకి సామాజిక, సంక్షేమ పథకాలు అందించడానికి సహాయపడే ఒక జాతీయ డేటాబేస్. అసంఘటిత రంగంలో పని చేసే ఏ కార్మికుడైనా ఈ-శ్రమ్ పోర్టల్ పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఉచితం. ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. మీరు రిజిస్ట్రేషన్ కోసం ఈ-శ్రమ్ పోర్టల్ http://eshram.gov.in అధికారిక పోర్టల్‌కి మాత్రమే వెళ్లాలి. ఇది కాకుండా మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 14434 ను కాల్ చేయవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి రూ.2 లక్షల ప్రయోజనం లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రతినెలా రూ.500 రూపాయాలు చెల్లిస్తున్నారు.