ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి.. భగ్గుమన్న బంగారం

దసరా కొనుగోళ్లకు సిద్ధమైన మగువలకు పసిడి ధరల షాక‌్

Update: 2024-10-02 12:15 GMT

ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి.. భగ్గుమన్న బంగారం

పశ్చిమాసియాలో యుద్ధ అలజడితో బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత రెండు రోజులుగా కొద్దిగా దిగివచ్చిన పసిడి ఇజ్రాయల్ పై ఇరాన్ క్షిపణి దాడులతో ఏకంగా ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 500 రూపాయలు పైగా భారమై 77,000 రూపాయలు దాటింది. 22 క్యారెట్ల పసిడి 71000 రూపాయలు పలికింది.

ఇక ఎంసీఎక్స్ లో పదిగ్రాముల బంగారం 681 రూపాయలు పెరిగి 75550 రూపాయలకు చేరింది. దసరా సీజన్ లో బంగారం కొనుగోళ్లకు మొగ్గుచూపిన మగువలను తాజా ధరలు నిరాశపరుస్తున్నాయి. యుద్ధ వాతావరణంతో పాటు స్టాక‌్ మార్కెట్ల అనిశ్చితి కూడా యల్లోమెటల్ కు డిమాండ్ పెంచింది. ఇక వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఇవాళ కిలో వెండి సగటున లక్ష ఒక వేయి రూపాయలు పలికింది.

Tags:    

Similar News