Draupadi Murmu : 15వ రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం
Draupadi Murmu: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 10.15 గంటలకు ప్రమాణం
Draupadi Murmu : భారత 15వ రాష్ర్టపతిగా ద్రౌపది ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం పది గంటల 15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే ఈ వేడుకలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిసి ఎన్వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ద్రౌపది ముర్ము రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. రాజ్ ఘాట్ నుంచి తాత్కాలిక నివాసానికి చేరుకుని రాష్ట్రపతి భవన్ వెళ్తారు. అక్కడి నుంచి పదవీ విరమణ చేసిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్ కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార అనంతరం 21 గన్ సెల్యూట్ లతో గౌరవ వందనం స్వీకరించనున్నారు ద్రౌపది ముర్ము. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ద్రౌపది ముర్ము ప్రమణ స్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, దౌత్య కార్యాలయాల చీఫ్ లు, పార్లమెంట్ సభ్యులు, ప్రధాన సైనిక అధికారులు కార్యక్రమానికి హాజరు కానున్నారు.