సలామ్ డాక్టర్ సాబ్.. భారీ ట్రాఫిక్ జామ్.. పేషెంట్ కోసం డాక్టర్ పరుగులు
Doctor: వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం.
Doctor: వైద్యో నారాయణ హరి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. ఆ మాటలకు సరైన ఉదాహరణగా నిలిచారు బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్. తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఓ డాక్టర్ 45 నిమిషాల పాటు నిర్విరామంగా పరిగెత్తి హాస్పిటల్ కు చేరుకున్నాడు. అనంతరం పేషెంట్ కు ఆపరేషన్ చేసి తన అంకిత భావాన్ని ప్రదర్శించారు. కర్ణాటక బెంగళూరులో గత నెల జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్జాపూర్‌లో ఉన్న మణిపాల్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్‌గా చేస్తున్న డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30వ తేదీన ఉదయం 10 గంటలకు ఓ మహిళకు గ్యాల్‌బాడర్ సర్జరీ చేయాల్సి వచ్చింది.
అయితే ఇంటి నుంచి బయలుదేరిన ఆ డాక్టర్ ఫుల్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు. సర్జరీకి లేట్ అవుతుందేమో అన్న కంగారులో ఆ డాక్టర్ మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీశాడు. డ్రైవర్‌కే కారును వదిలేసిన ఆ డాక్టర్ శరవేగంగా హాస్పిటల్‌కు చేరుకుని సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ చేశారు. పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నారని, షెడ్యూల్ ప్రకారమే డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఆసుపత్రికి పరిగెడుతున్న వీడియోను ఇటీవల తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వృత్తి పట్ల వైద్యుడి నిబద్ధత, ఆయన మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.