తమిళులు గర్వపడే విషయం ఇది : ఎంకే స్టాలిన్
తమిళులు గర్వపడే విషయం ఇది. తమిళనాడు మూలాలు గల మహిళ యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం గర్వకారణం. కఠిన శ్రమ, అంకితభావంతో తమిళ మహిళ అమెరికాను పాలించగల సమర్థత కలిగి ఉందనే విషయాన్ని నిరూపించారు
ఇటివల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాకి తొలి ఉపాధ్యక్షురాలిగా గెలిచి చరిత్ర సృష్టించారు భారత సంతతికి చెందిన కమలా హారిస్.. ఈ సందర్బంగా ఆమెకి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగానే డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆమెకి ఓ లేఖను రాశారు.. ఈ లేఖలో స్టాలిన్.. ''వణక్కం.... తమిళులు గర్వపడే విషయం ఇది. తమిళనాడు మూలాలు గల మహిళ యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం గర్వకారణం. కఠిన శ్రమ, అంకితభావంతో తమిళ మహిళ అమెరికాను పాలించగల సమర్థత కలిగి ఉందనే విషయాన్ని నిరూపించారు''అని తమిళంలో లేఖ రాశారు స్టాలిన్..
కమలా హారిస్ తల్లిదండ్రులు ఎన్నో దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వచ్చిన సంగతి తెలిసిందే.. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్- డొనాల్డ్ హారిస్‌లు.. శ్యామలా గోపాలన్ తమిళనాడులోని చెన్నైకి చెందినివారు.. న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికాకి వెళ్ళగా అక్కడ జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో అమెకి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. ఇక ఈ దంపతులకి 1964 అక్టోబర్ 20న కమలా హారిస్ కాలిఫోర్నియాలో జన్మించారు. ఇక కమలా హారిస్ కి సోదరి మాయా హారిస్ కూడా ఉన్నారు. అటు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ కమలా హారిస్ కావడం విశేషం.. . యుఎస్ సెనెట్‌కు ఎన్నికైన తొలి దక్షిణాసియా దేశాల సంతతి కూడా ఆమె కావడం గమనార్హం.