నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కు కరోనా..!

Update: 2020-09-24 05:39 GMT

భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కరోనా బారిన పడ్డారు. గత కొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతుండగా, తాజాగా కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన చికిత్స నిమిత్తం చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గత వారం డీఎండీకే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో విజయకాంత్ పాల్గొన్నారు. కొన్నిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే, ఇప్పుడు కరోనా మహమ్మారి సోకడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా విజయ్ కాంత్ అభిమానులు పూజలు చేస్తున్నారు.

Tags:    

Similar News