Digvijay Singh demand to postpone Ayodhya Event: అయోధ్యపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు..
Digvijay Singh demand to postpone Ayodhya Event: ఎన్నో దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 5 ప్రారంభించనున్నారు.
Digvijay Singh demand to postpone Ayodhya Event: ఎన్నో దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 5 ప్రారంభించనున్నారు. రామమందిర భూమి పూజకు అంతా సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 5 న జరిగే భూమిపూజ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి నిర్ణయించిన ముహర్తం అమంగళమైనదని అన్నారు. దశాబ్దాల పోరాటం తర్వత రామాలయ నిర్మాణం ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పట్టుదలకు పోతే ఆలయ నిర్మాణ ప్రక్రియకు అవాంతారాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. సనాతన ధర్మ పద్ధతులను అలక్ష్యం చేయడం వల్లే ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ తో బాటు భూమిపూజ నిర్వహించే స్వామీజీల్లో కొందరు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారని, అలాగే హోం మంత్రి అమిత్ షా సైతం కోవిడ్-19 కి గురయ్యారని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా కరోనా పడ్డరని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలకు రాముడు కేంద్రబిందువని, సతానత సంప్రదాయాలతో చెలగాటమాడటం తగదని అన్నారు. సనాతన ధర్మ కట్టుబాట్లు, సంప్రదాయాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? ఇందుకు దారితీసిన అనివార్య కారణాలేమిటి?' అని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఎప్పుడో అయోధ్య మందిర నిర్మాణానికి రాజీవ్‌గాంధీ చేతుల మీద భూమి పూజ జరిగిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దిగ్విజయ్ సింగ్ మరోసారి తిరిగి ప్రస్తవించారు.