PM Modi: మన ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఫోన్ వాడతారో తెలుసా?

Update: 2021-08-21 07:45 GMT

PM Modi: మన ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఫోన్ వాడతారో తెలుసా? (ట్విట్టర్ ఫోటో)

Narendra Modi Phone: భారత ప్రధాని నరేంద్ర మోడీ తరచుగా సెల్ఫీలు తీసుకోవడం మనం చూస్తుంటాం. దీనితో పాటు, ప్రధాని మోడీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. టెక్నాలజీపై ఆయన ఆసక్తి కూడా ఎప్పటికప్పుడు కనిపిస్తుంది. అదే సమయంలో, అతను ఎప్పటికప్పుడు సాంకేతికత ప్రాముఖ్యత..దాని సరైన ఉపయోగం గురించి భారతదేశ ప్రజలకు కూడా చెబుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ప్రతి ఒక్కరి మనస్సులో ఒక ప్రశ్న కచ్చితంగా తలెత్తుతుంది. ప్రధాని మోడీ స్వయంగా ఏ ఫోన్ ఉపయోగిస్తారు? ఆయన ఎటువంటి సాంకేతికత ఉన్న ఫోన్ వాడతారు? అదే తెలుసుకుందాం రండి.

నరేంద్ర మోడీ సాధారణంగా ఐఫోన్ వాడుతున్నట్టుగా చాలా ఫోటోలలో కనిపిస్తుంది. కానీ, ఆయన వాడే ఫోన్ ఐ ఫోన్ కాదు. అయితే, ఇలా అనిపించడానికి కారణం తరచుగా ఐఫోన్ సెల్ఫీలు తీసుకునేటప్పుడు లేదా ఇతర సందర్భాలలో ప్రధాని మోడీ చేతిలో అది కనిపించడం. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సందర్భాలన్నింటిలో, ప్రధాని మోడి చేతిలో వివిధ రకాల ఐఫోన్‌లు కనిపిస్తాయి. అంటే ప్రధాని మోడీ ఐఫోన్‌ను ఆ సందర్భంలో మాత్రమే ఉపయోగిస్తారని. అదేవిధంగా ఈ ఐఫోన్‌లు ఆయనకు చెందినవి కావని ఇది రుజువు చేస్తుంది. మరి ప్రధాని మోడీ వాడే ఫోన్ ఏమిటి.. అదే చెప్పబోతున్నాం..

ప్రధాని మోడీ ఏ ఫోన్‌ని ఉపయోగిస్తున్నారు?

ప్రత్యేకంగా రూపొందించిన RAX (పరిమిత ప్రాంత మార్పిడి) ఫోన్ లేదా ఉపగ్రహ ఫోన్‌ని నరేంద్ర మోడీ ఉపయోగిస్తారు. ఈ ఫోన్‌లో కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. ఈ ఫోన్ హ్యాక్ లేదా ట్రాక్ అయ్యే చాన్స్ లేదు. ఈ ఫోన్‌లు మిలిటరీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో పనిచేస్తాయి. అలాగే, NTRO..DEITY వంటి ఏజెన్సీలు వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయి. దీనితో పాటు, ప్రధాని మోడీ తన కార్యాలయంలో ఉపగ్రహ నంబర్లను ఉపయోగిస్తున్నారు. ఇది మూడు పొరల గుప్తీకరించిన భద్రతను కలిగి ఉంటుంది. దానిని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం.

ఇది కాకుండా, ఏదైనా విషయం గురించి ఎవరితోనైనా ఫోన్ లో మాట్లాడటానికి ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శిని పిలవాలసి ఉంటుంది. మోడీ ప్రధాన కార్యదర్శి ఫోన్ కూడా ప్రత్యేకంగా రూపొందించిందే. దీనిని నవరత్న డిఫెన్స్ PSU (పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తయారు చేసింది. ఇది చాలా సురక్షితమైన ఎన్‌క్రిప్ట్ చేయబడిన మొబైల్ ఫోన్.

ప్రధాని మోడీ సురక్షిత ఫోన్‌ని ఉపయోగించడానికి కారణాలు

దీనిగురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అయినా సందర్భం వచ్చింది కనుక చెప్పుకుందాం..నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాన మంత్రి. ఆయన ప్రపంచ నాయకుడు కూడా. దేశం మొత్తం మీద ఆయనకు భారీ బాధ్యత ఉంది. అందువల్ల, ఆయన గోప్యత చాలా ముఖ్యం. అందుకే ప్రధాని మోడీ అలాంటి ఫోన్‌ని ఉపయోగించడం ముఖ్యం. దీని వలన ఆయన ఫోన్ హ్యాక్ చేయడం జరగదు. 

Tags:    

Similar News