Dhruvastra India's Anti-tank Guided Missile: శత్రువుల పై ప్రయోగానికి దేశీయ 'ధృవాస్త్ర' రెడీ!
Dhruvastra India's Anti-tank Guided Missile: పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ తన అమ్ముల పొదలో మరిన్నిఅస్త్రలను సమకూర్చుకుంటుంది.
Dhruvastra India's Anti-tank Guided Missile: పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ తన అమ్ముల పొదలో మరిన్నిఅస్త్రలను సమకూర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత వాయు సేన అత్యధునిక యుద్ధ సామగ్రిని దిగుమతి చేసుకోవడమే కాకుండా దేశీయంగా కూడా తయారు చేస్తున్నది. ఇప్పటికే మన వద్ద అగ్నికి సంబంధించిన మిసైల్స్ అన్ని దేశీయంగా రూపొందించబడినవే అందుకు నిదర్శనం. అయితే, పొరుగుదేశాలు దాడులను సమర్థవంతంగానే ఎదుర్కోడంలో పురోగతి సాధించిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ తరుణంలోనే ఒడిషాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నిర్వహించిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి 'ధ్రువాస్త్ర' ప్రయోగాలు మూడూ విజయవంత మయ్యాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఏ) రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ పై నుంచి ప్రయోగించవచ్చు. వాతావరణంతో సంబంధం లేకుండా ప్రయోగించగలిగే ధ్రువాస్త్ర యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వర్గానికి చెందింది. 'ఫైర్ అండ్ ఫర్గెట్' క్లాస్‌లో మూడో తరానికి చెందిందని సమాచారం. బ్యాటిల్ కన్వెన్షన్ ఆర్మర్, ఎక్స్‌ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్‌లు ఉన్న యుద్ధ ట్యాంకులను కూడా ధ్రువాస్త్రతో ఓడించ వచ్చని అధికారులు తెలిపారు. ప్రపంచంలోని ఈ తరహా క్షిపణుల్లో ఇది అత్యంత ఆధునికమైనదని డీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. ఆకాశం నుండి భూమి మీద కదిలే శత్రు ట్యాంకర్లను నాశనం చేయగల ధ్రువాస్త్ర మిసైళ్ళు సైన్యానికి ఎంతో రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లోనూ., తాజాగా 22న మరో మిసైల్‌ను ప్రయోగించారు. ధ్రువాస్త్ర శక్తితోపాటు మార్గనిర్దేశక వ్యవస్థను కూడా పరీక్షించామని, ఈ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని వారు పేర్కొన్నారు.
ఈప్పటికే జమ్మూకాశ్మీర్ లోని గల్వనా లోయలో భారత సైనికులపై దాడి చేయడంతో ..ఆ దాడిని మోడీ సర్కారు ప్రతిఘటిస్తూ.. చైనా ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడేలా..డిజిటల్ వార్ ను ప్రకటింchi. అందులో భాగంగానే.. చైనా కు చెందిన టిక్ టాక్ ఆప్ తో పాటు 59 ఆప్ బ్యాన్ చేసినా విషయం చేసిందే.